: కేసీఆర్ కు గజ్జెల కాంతం సవాలు


కేసీఆర్ కు నిజంగా తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తన కుంటుంబంతో పాటు ఛలో అసెంబ్లీలో పాల్గోవాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం సవాలు విసిరారు. ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు చేసుకుంటూ కేసీఆర్ బ్రతికేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఛలో అసెంబ్లీ అంటూ ప్రభుత్వంపై యుద్ధానికి పిలుపునిచ్చి, మళ్లీ ప్రభుత్వాన్నీ బాబ్బాబు అనుమతినివ్వండి అని అడుక్కోవడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న ప్రతి ఒక్కర్నీ అనుమతి ఇవ్వండంటూ టీఆర్ఎస్, దాని చెమ్చా పక్షాలు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండి పడ్డారు. నాటకాలాడడం, కల్లబొల్లి కబుర్లు చెప్పడం కేసీఆర్ నైజమని, కేసీఆర్, అతని కుటుంబసభ్యుల అబద్దాలను ప్రజలు నమ్మి మోసపోతున్నారని కాంతం ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల శవాలమీద కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని గజ్జెల కాంతం విమర్శించారు.

  • Loading...

More Telugu News