బ్యాంకు మోసం కేసు... అనిల్ అంబానీకి మరోసారి ఈడీ నోటీసులు
- ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ
- ఎస్బీఐ నుంచి తీసుకున్న రుణాల ఎగవేత, నిధుల తరలింపుపై ప్రశ్నించనున్న ఈడీ
- విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు మోసం కేసు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను వచ్చే వారం ఈడీ విచారించనుంది. ఈ మేరకు నవంబర్ 14న విచారణకు తమ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
ఎస్బీఐ నుంచి తీసుకున్న రుణాల ఎగవేత, ఆ నిధుల తరలింపునకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనుంది.
రూ. 17 వేల కోట్ల రుణ మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని ఈ ఏడాది ఆగస్టులో ఈడీ విచారించింది. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు ఈ మొత్తాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ. 7,500 కోట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది.