: 332 మందుల షాపులకు షోకాజ్ నోటీసులు
రాష్ట్రంలో గర్భస్రావాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా కొన్ని సర్వేల్లో నమ్మశక్యం కాని నిజాలు వెల్లడైనందున ఉపశమన చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం జరిగిన తప్పులు సరిదిద్దుకునేందుకు రంగం సిద్దం చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గర్భనిరోధక మాత్రలు విచ్చలవిడిగా అమ్ముతున్న 332 దుకాణాలకు ఔషధనియంత్రణ శాఖాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.