: రేపు ఓయూ పరిధిలో పరీక్షలుండవ్!
తెలంగాణ పొలిటికల్ జేఏసీ రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాలని పట్టుదల ప్రదర్శిస్తుండడంతో ఓయూ పరిధిలో శుక్రవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. అంతేగాకుండా, గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.