: బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో 'మనమ్మాయిలు' పదిలం
హైదరాబాద్ బ్యాడ్మింటన్ తారలు సైనా నెహ్వాల్, పీవీ సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో తమ స్థానాలను నిలుపుకున్నారు. భారత ఏస్ షట్లర్ సైనా వరల్డ్ నెంబర్ 2గా కొనసాగుతుండగా.. భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్న తెలుగమ్మాయి సింధు 11వ స్థానాన్ని పదిలపరుచుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకులను నేడు విడుదల చేసింది. కాగా, ఇటీవలే థాయ్ ఓపెన్ గెలిచి సంచలనం సృష్టించిన తెలుగుతేజం శ్రీకాంత్ 5 స్థానాలు ఎగబాకి 47వ ర్యాంకుకు చేరుకున్నాడు.