: రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాలు


శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. తెలంగాణా జిల్లాలతో పాటు ఆంద్ర ప్రాంతంలోని పలు జిల్లాలు కూడా వర్ష ప్రభావానికి గురయ్యాయి. పిడుగులు పడడం, ఇళ్ళు కూలిపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మంది మరణించారు. 52 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిని, రైతుల జీవితాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదు, విజయవాడ నగరాల్లో భారీ వర్షం వల్ల జన జీవనానికి తీవ్ర విఘాతం కలిగింది.

  • Loading...

More Telugu News