కర్నూలు ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్ లో బైకర్.. వీడియో ఇదిగో!
- మద్యం మత్తులో బైక్ నడిపిన యువకుడు
- పెట్రోల్ బంక్ లో మత్తులో తూలుతున్నట్టు కనిపించిన శివశంకర్
- శివశంకర్ తో పాటు మరో యువకుడు
బైక్ ను ఢీ కొట్టడమే కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమని భావిస్తున్న తరుణంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి ముందు శివశంకర్ మరో యువకుడితో కలిసి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోలో శివశంకర్ మత్తుతో తూలుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.