: బస్సుకు ఫిట్ నెస్ లేదా.. అయితే కేసే!
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కిన స్కూలు బస్సులపై కొరడా ఝుళిపించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నేడు నిర్వహించిన దాడుల్లో 42 బస్సులు అక్రమంగా తిరుగుతున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఫిట్ నెస్ లేకుండా తిరుగుతోన్న 477 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇకనైనా ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని బస్సులకు తక్షణమే ధ్రువపత్రం పొందాలని రవాణా శాఖ కమిషనర్ అనంతరాము స్పష్టం చేశారు. ఫిట్ నెస్ లేకున్నా, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకున్నా కేసు తప్పదని ఆయన ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలను హెచ్చరించారు.