: అద్వానీని బుజ్జగించక్కర్లేదు: శివరాజ్ సింగ్ చౌహన్


అద్వానీని బుజ్జగించాల్సిన పని లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గుణలో నేడు చౌహాన్ మాట్లాడుతూ, అద్వానీ రాజీనామా ఉపసంహరించుకున్నందున ఎవరూ ఆయను బుజ్జగించక్కర్లేదని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ, వాజ్ పేయిలోని వినయవిధేయతలు చౌహాన్ లో ఉన్నాయనీ, మోడీ కంటే చౌహాన్ సమర్ధుడని పొగిడిన సంగతి తెలిసిందే. తాజా వివాదంతో అద్వానీని పరామర్శించేందుకు వెళతారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. అయితే తన కుమారుడు కార్తికేయ ఇప్పుడే రాజకీయాల్లోకి రాడని తెలిపారు.

  • Loading...

More Telugu News