: ఎర్రచందనం స్మగ్లర్లకు ఇక చుక్కలే!


ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతం నుంచి ప్రతి ఏడాదీ విదేశాలకు అక్రమంగా తరలిపోయే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆటకట్టించేందుకు కొత్త ఫోర్సును ప్రభుత్వం రంగంలోకి దించింది. శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే శ్రేష్ఠమైన ఎర్రచందనాన్ని రక్షించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్సును అటవీశాఖ, పోలీసుల శాఖల సంయుక్త సిబ్బందితో ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

శేషాచలం అడవుల్లో ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైన ఎర్రచందనం లభిస్తుంది. దీనికి విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. దీంతో ప్రతి ఏడాది ఇక్కడ్నుంచి అక్రమంగా వేల టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిపోతోందన్నది బహిరంగ రహస్యమే. సాక్షాత్తూ ప్రభుత్వానికి తెలిసినా పట్టించుకునే నాధుడు లేడు. అదీ కాక, ఈ అక్రమరవాణా తతంగం వెనుకన బడానేతల హస్తాలున్నాయని కూడా స్మగ్లర్లు చెబుతుంటారు. అయితే, ఇక్కడి వ్యవహారం మొత్తం మధ్యవర్తుల మధ్యే నడుస్తుంది. ఎర్రచందనాన్ని నరికేందుకు స్థానికులు ఇష్టపడకపోవడం, కూలీలు ఎక్కువ అడుగుతుండడంతో స్మగ్లర్లు స్థానికుల కంటే తమిళులవైపే మొగ్గుచూపుతుంటారు. వీరి ఆకారం చూస్తేనే భయమేస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వీరు వెనుకాడరు. వీరు రెండు జట్లుగా చందనం చెట్లను నరకడానికి బయలుదేరుతారు. ఒక జట్టు పహారా కాస్తుంటే, మరోజట్టు చెట్లపని పడతారు. పనంతా పూర్తయ్యాక లారీలు, ట్రాక్టర్లలో దుంగలను తరలిస్తారు.

ఈ మధ్యకాలంలో స్మగ్లర్లు అటవీశాఖ అధికారులనే టార్గెట్ చేస్తున్నారు. వీరి దూకుడుకి అటవీశాఖాధికారులు ప్రాణాలొదిలేస్తున్నారు. గత నెలలో చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుసార్లు వీరిపై ఎదురుకాల్పులు జరిపి స్మగ్లర్లు పరారయ్యారు. వీరిదగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండడంతో పోలీసులు అసువులుబాస్తున్నారు. దీంతో పోలీసుశాఖ అధికారులు, అటవీశాఖ అధికారులతో సంయుంక్తంగా స్మగ్లర్ల ఆటకట్టించడానికి పూనుకున్నారు.

  • Loading...

More Telugu News