: డేంజర్లో ఇండియన్స్


ఆరోగ్యం విషయంలో భారతీయులు జర జాగ్రత్తగా ఉండాలండోయ్. రానున్న రెండు దశాబ్ధాల్లో భారతీయుల్లో ఊబకాయులు విపరీతంగా పెరిగిపోతారని ఓ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, లండన్ కు చెందిన ఇంపీరియల్ కళాశాల సంయుక్తంగా జరిపిన పరిశోధనలో భారతీయుల దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. కొన్నేళ్లుగా భారతదేశంలోని వాహనరంగంలో ఏర్పడిన పెను మార్పులతో అధికశాతం భారతీయులు బైక్, కారు వంటి వాహనాలను సొంతం చేసుకుంటున్నారు. రోజువారీ పనుల్లో వారి శరీరం కనీస శ్రమకు కూడా గురికావడం లేదు. దీంతో చాలామంది ఇప్పటికే ఊబకాయంతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.

భవిష్యత్తులో ఈ అనారోగ్య సమస్యలు ఇంకా పెరిగి ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. పల్లె, పట్టణాల్లో నివసించే 4000 మంది భారతీయులపై ఈ పరిశోధన జరిగింది. 60 శాతం గ్రామీణులు సైకిల్, కాలినడకను తమ రోజువారి జీవనానికి అనుసంధానిస్తున్నారు. అందువల్ల నగరవాసులతో పోలిస్తే గ్రామీణులు పౌష్ఠికాహారం తక్కువగా తింటున్నప్పటికీ ఆరోగ్యవంతులుగానే ఉన్నారు. కానీ మంచి ఆహారాన్ని తీసుకుంటున్న పట్టణవాసులు నడక, సైకిల్ స్వారీకి దూరంగా ఉండడంతో వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఈ శోధనలో తేలింది.

  • Loading...

More Telugu News