: 17 కి. మీ.. సిగ్నల్ లేకుండా ముంబైలో రయ్ రయ్
ముంబై వాసులకు శుభవార్త. ముంబైలో నిర్మించిన ఈస్టర్న్ ఫ్రీవే రేపటినుంచి ఉపయోగంలోకి రానుంది. దీంతో ముంబైలో 17 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చు. 17 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలో సిగ్నల్స్ ఉండవు. గతంలో సౌత్ ముంబైనుంచి ఈస్ట్ ముంబైకి గంటకు పైగా పట్టిన సమయం ఈ ఫ్రీవే వల్ల 20 నిముషాల్లోనే నిరాటంకంగా సాగిపోవచ్చు. ఈస్టర్న్ ఫ్రీవేను ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు.