: జగన్ విషయంలో జోక్యం చేసుకోండి సార్: గవర్నర్ కు వైకాపా ఎమ్మెల్యేల మొర


వైఎస్ జగన్ విషయంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. నేడు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఆ పార్టీ నేతలు జగన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కోరారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆ రెండు పార్టీలు జగన్ ను ప్రజల నుంచి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని గవర్నర్ కు వివరించామని తెలిపారు. సీబీఐ ఈ రెండు పార్టీల కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయనకు ఫిర్యాదు చేశామన్నారు. జగన్ అరెస్టును నామా నాగేశ్వరరావు, లగడపాటి రాజగోపాల్ లు ముందే చెప్పడాన్ని బట్టి సీబీఐ తీరు అర్థమవుతోందని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. విజయసాయి, జగన్ లను వేర్వేరు జైళ్ళలో ఉంచాలని రేవంత్ రెడ్డి మాట్లాడిన వెంటనే సీబీఐ ఆ దిశగా పిటిషన్ వేసిందని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News