: ఇండియాలో సాకర్ ప్రపంచకప్!
అండర్-17 ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ ను మనదేశంలో నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిడ్ వేయాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ టోర్నీని 2017లో తమ దేశంలో నిర్వహించేందుకు అనుమతివ్వాలని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఏ)ను ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) కోరనుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.