: గ్లిజరిన్ అవసరంలేని సినీతార!


సినిమాల్లోనూ, టీవీ సీరియళ్ళలోనూ కొందరు తారామణులు కన్నీళ్ళతో సునామీలను అలవోకగా ఆవిష్కరిస్తారు. ఆ ఉప్పెనలో వీక్షకులను ముంచేస్తారు. వారి అసలు లక్ష్యమూ అదే. అయితే, ఆ కన్నీటి వెనుక ఓ కథ ఉంది. ఎవరికైనా అనుకున్నంతగానే ఏడుపు రాదు కదా? అందుకు, గ్లిజరిన్ ఉపయోగిస్తారు. రెండు చుక్కలు కళ్ళలో వేసుకోగానే బొటబొటా కన్నీళ్ళు కారిపోతాయి. ఇది ఎప్పటినుంచో అనుసరిస్తున్న పద్ధతి. కానీ, బాలీవుడ్ వర్ధమాన హీరోయిన్ సోనమ్ కపూర్ ది ఈ విషయంలో విలక్షణ శైలి.

తను గ్లిజరిన్ కు నో చెబుతోంది. తలచినంతనే అశ్రుజలాలు అలా ఉబికివస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇది ఎలా సాధ్యమని అడిగితే, చిద్విలాసంగా కళ్ళెగరేస్తూ.. 'నేను పాత్రలో లీనమైపోతాను, ఆ పాత్రను ఆవాహన చేసుకుంటాను. అంతే, ఏడుపు తన్నుకుని వస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. కాగా, దక్షిణాది హీరో ధనుష్ హీరోగా సోనమ్ నటించిన తాజా చిత్రం 'రాన్ జానా' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News