: ముషారఫ్ తో పాక్ పోలీసుల బంతాట!
పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ను కష్టాలు ఇప్పట్లో వీడేట్టు కనిపించడంలేదు. పాక్ పోలీసులు ముషారఫ్ పై నమోదు చేసిన కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. న్యాయమూర్తుల తొలగింపు, బేనజీర్ భుట్టో హత్య కేసులతో ఇప్పటికే బిక్కచచ్చిపోయిన ఈ మాజీ అధ్యక్షుడిపై తాజాగా మరో ఉపద్రవం వచ్చిపడింది. 2006లో బలూచ్ జాతీయ పార్టీ నాయకుడు అక్బర్ బుగ్టిని ఓ మిలిటరీ ఆపరేషన్ లో హతమార్చారన్న ఆరోపణలపై ముషారఫ్ ను నేడు పోలీసులు అరెస్టు చేశారు. క్వెట్టాలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు రెండు వారాల జ్యుడిషియల్ కస్డడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, న్యాయమూర్తుల తొలగింపు, భుట్టో హత్య కేసుల్లో ఆయన ఇప్పటికీ రిమాండ్ లోనే ఉన్నారు.