ఎవరికీ తలవంచను... ఎంతటివారినైనా ప్రశ్నిస్తా: దీపికా పదుకొణే

  • ఐఎమ్‌డీబీ జాబితాలో అరుదైన ఘనత సాధించిన దీపిక
  • గత 25 ఏళ్ల ఉత్తమ చిత్రాల్లో ఆమె నటించిన 10 సినిమాలకు చోటు
  • స్టార్ హీరోలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిన వైనం
  • ఎవరికీ తలవంచనంటూ వివాదాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ భారీ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించిన నేపథ్యంలో, దీపిక పరోక్షంగా స్పందిస్తూ తన వ్యక్తిత్వాన్ని సూటిగా వెల్లడించారు. 

ప్రముఖ ఆన్‌లైన్ మూవీ డేటాబేస్ ఐఎమ్‌డీబీ (IMDb) ‘25 ఏళ్ల భారతీయ సినిమా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో దీపిక అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ జాబితాలోని 130 ఉత్తమ చిత్రాలలో ఏకంగా 10 సినిమాలు దీపిక నటించినవే కావడం విశేషం. ఈ క్రమంలో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రభాస్ వంటి అగ్ర తారలను కూడా ఆమె అధిగమించారు.

ఈ రికార్డుపై ఆనందం వ్యక్తం చేసిన దీపిక, తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను ముక్కుసూటిగా వ్యవహరిస్తాను. నమ్మిన విలువల విషయంలో రాజీపడను. నాకు తప్పు అనిపిస్తే, ఎదుటివారు ఎంతటి వారినైనా సరే ప్రశ్నించడానికి వెనుకాడను. అది నా నైజం. అవసరమైతే కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటానే తప్ప, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు” అని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News