చిన్న కాంట్రాక్టర్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

  • గత టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు చర్యలు
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో చర్యలు చేపట్టిన ఆర్దిక శాఖ
  • రూ.5 లక్షల్లోపు చిన్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు వెంటనే అనుమతి
దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గత టీడీపీ హయాంలో అంటే 2014-19 మధ్య కాలంలో రూ.5 కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది.  

అలాగే రూ.5 లక్షల్లోపు చిన్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం గత ఆరేళ్లుగా తమ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్లకు ఊరటనివ్వనుంది. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ, బకాయిల చెల్లింపులకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు రూ.400 కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి.

ఇప్పటికే పలు దఫాలుగా చెల్లింపులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున బకాయిల చెల్లింపులను ప్రారంభించింది. చిన్న కాంట్రాక్టర్ల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లో బిల్లుల సొమ్ము జమ కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 


More Telugu News