: టీడీపీ లేఖ స్పీకర్ ను కించపరిచేదిగా ఉంది: సర్కారు
తమ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నాయకులు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ఉద్ధేశిస్తూ రాసిన లేఖను శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఈ లేఖ స్పీకర్ ను అవమానించేలా ఉందని ఆరోపించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతల తీరును గర్హించారు. అన్ని పార్టీల శాసనసభ్యుల పట్ల ఒకే తీరుగా వ్యవహరిస్తున్నామని, ఎవరిపట్ల పక్షపాత ధోరణి కనబర్చడంలేదని వివరణ ఇచ్చారు.