: చంద్రబాబు.. 'చలో అమెరికా'..
రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర పరిణామాలు నెలకొని ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిమ్మకునీరెత్తినట్టు ఉన్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అందరూ 'చలో అసెంబ్లీ' అంటుంటే.. బాబు మాత్రం 'చలో అమెరికా' అంటూ విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్న చందంగా బాబు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
అసెంబ్లీ రేపటికి వాయిదాపడిన అనంతరం హరీశ్ రావు సభ మీడియా పాయింట్ వద్ద పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్బంగా బాబుపై ఆరోపణలు గుప్పించారు. చలో అసెంబ్లీపై రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. 'చలో అసెంబ్లీ'కి తమను జేఏసీ ఆహ్వానించలేదని ఒకరోజు.. 'చలో అసెంబ్లీ'కి టీ. టీడీపీ మద్దతు అని మరొకరోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని.. ఇంతకీ టీడీపీ అసలు వైఖరేంటో స్పష్టీకరించాలని హరీశ్ డిమాండ్ చేశారు.