: ఓయూ విద్యార్థుల అరెస్ట్
అసెంబ్లీ వద్దకు ర్యాలీగా బయల్దేరిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ సిటీ బస్సులో అసెంబ్లీ వద్దకు చేరుకున్న విద్యార్థులను అక్కడ భద్రత విధులు నిర్వహిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థి జేఏసీ అసెంబ్లీ గేట్-2 వద్దకు దూసుకెళ్ళడంతో పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఉదయం నుంచి ఓయూ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో అసెంబ్లీవైపు కదలగా.. ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు వారిని ఆపేశారు. దీంతో, విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.