జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి ఇంధనం లాంటివి: మంత్రి నారా లోకేశ్
- కొత్త పన్నుల విధానం పెట్టుబడులకు మార్గం వేస్తుందన్న నారా లోకేశ్
- తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయన్న లోకేశ్
- స్వదేశీ తయారీ నినాదాన్ని అందరం స్వీకరిద్దామని పిలుపు
జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని ఆయన ప్రశంసించారు.
ప్రధానమంత్రి మోదీ దూరదృష్టితో చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారుతాయని లోకేశ్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 రూపంలో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ తయారీ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని లోకేశ్ అన్నారు. ఈ విధానం సామాన్యులకు తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
స్థానిక ఉత్పత్తికి బలం చేకూర్చి, పన్నుల భారాన్ని తగ్గించే ఈ విధానం ఒక పండుగలాంటిదని ఆయన అభివర్ణించారు. స్వదేశీ తయారీ నినాదాన్ని మనమందరం స్వీకరిద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన వీడియోను నారా లోకేశ్ ఎక్స్‌లో పంచుకున్నారు.