అమెజాన్ టు టీసీఎస్.. హెచ్-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?
- హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల వార్షిక ఫీజు విధింపు
- రేపటి నుంచి అమల్లోకి కొత్త నిబంధన
- ఈ ఏడాది అత్యధిక వీసాలు పొందిన రెండో కంపెనీగా టీసీఎస్
- 10,044 వీసాలతో అగ్రస్థానంలో అమెజాన్
- అమెరికన్ల ఉద్యోగాల కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం వెల్లడి
- భారత ఐటీ కంపెనీలు, నిపుణులపై తీవ్ర ప్రభావం
అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న భారత ఐటీ నిపుణులకు, కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) వార్షిక ఫీజు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక కీలక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ కొత్త నిబంధన ఈ నెల 21 నుంచి తక్షణమే అమల్లోకి రానుందని, ఏడాది పాటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను కొన్ని కంపెనీలు వ్యవస్థాగతంగా దుర్వినియోగం చేస్తున్నాయని, దీనివల్ల అమెరికన్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ‘రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సెర్టెన్ నాన్-ఇమిగ్రెంట్ వర్కర్స్’ పేరిట జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ, అదే సమయంలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది.
హెచ్-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?
ఈ నిర్ణయం వెలువడిన కొద్ది రోజుల ముందే, 2025 సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాలు పొందిన కంపెనీల జాబితాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అమెజాన్ 10,044 వీసాలతో అగ్రస్థానంలో నిలవగా, భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 5,505 వీసాలతో రెండో అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది.
ఇతర టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181) కూడా భారీ సంఖ్యలో వీసాలు పొందాయి. భారత కంపెనీలైన ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా (951) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విధించిన లక్ష డాలర్ల ఫీజుతో ఈ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది.
హెచ్-1బీ ఉద్యోగుల వల్ల కంపెనీలకు 36 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుందని ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ ప్రభుత్వం తెలిపింది. కొన్ని కంపెనీలు వేలల్లో వీసాలు పొందుతూ, అదే సమయంలో పదివేల మందికి పైగా స్థానిక ఉద్యోగులను తొలగించాయని తన ఉత్తర్వుల్లో తీవ్రంగా విమర్శించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలకు హెచ్-1బీ వీసా వీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియ అత్యంత ఖరీదైనదిగా మారనుంది.