: రాష్టంలో మరో 24 గంటలు వర్షాలు


రాష్ట్ర వ్యాప్తంగా మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం మీదుగా ఆగ్నేయ దిశలో రాష్ట్రంలోకి చల్లని గాలులు వీస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి కర్ణాటక మీదుగా రాజస్థాన్ వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. 

వీటి ప్రభావం వల్ల తెలంగాణలో వడగండ్ల వానలు, కోస్తాంధ్రల్లో ఉరుములతో కూడిన జల్లులు, రాయలసీమ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

  • Loading...

More Telugu News