: ఓయూలో పరిస్థితి ఉద్రిక్తం


ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు మరోసారి పోరుబాట పట్టారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ రేపు నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సర్కారు అనుమతివ్వకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉస్మానియా క్యాంపస్ నుంచి అసెంబ్లీ వద్దకు ర్యాలీగా బయల్దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు రాళ్ళు రువ్వగా, ప్రతిగా, పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ప్రస్తుతం ఉస్మానియా మెయిన్ గేట్ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News