: ఇక సునామీని గుర్తించడం సులభం


సునామీ వస్తుంది అనే విషయాన్ని ముందుగానే గుర్తించేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అమధ్య కాలంలో సంభవించిన సునామీ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అందుకే ముందస్తు సునామీ హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో రంగచాంగ్‌ వద్ద 'ముందస్తు సునామీ హెచ్చరిక వ్యవస్ధ (ఎర్లీ సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌)'ని ఏర్పాటు చేశారు. భూకంపం సంభవించిన మూడు నిముషాలలోపే సునామీ రాకను ఈ వ్యవస్ధ పసిగడుతుందని 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ'కి చెందిన ముఖ్య శాస్త్రవేత్త వినీత్‌ కుమార్‌ చెబుతున్నారు. సముద్రంలో భూకంపం కారణంగా ఏర్పడిన తొలి ప్రకంపనలు వచ్చిన మూడు నిమిషాల వ్యవధిలోనే అక్కడి అలల స్థాయిని బట్టి సునామీ రాకను గురించి ఈ వ్యవస్థ హెచ్చరిస్తుందని ఆయన చెబుతున్నారు.

మంగళవారం నాడు డోలీగంజ్‌లో జరిగిన ఒక సమావేశంలో వినీత్‌ ఈ విషయాలను వెల్లడించారు. ఈ వ్యవస్థ నుండి అందే సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ (ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌) సునామీ హెచ్చరికలను జారీ చేస్తుందని ఆయన తెలిపారు. సముద్ర జలాలు 5 నుండి 15 మీటర్లు పెరిగినప్పుడు ఏయే ప్రాంతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయంపై కూడా అధ్యయనం చేసి తాము నివేదికను సమర్పించామని, ఈ నివేదిక ఆధారంగా అధికార యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వినీత్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News