: కొడుకు పెళ్లి పనుల్లో ఉన్న తల్లిదండ్రులను కబళించిన మృత్యువు
- రోడ్డు ప్రమాదంలో వరుడి తల్లిదండ్రుల మృతి
- పూజారితో మాట్లాడి వస్తుండగా వారి బైక్ ను ఢీ కొట్టిన వ్యాన్
- ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరు గ్రామంలో విషాదం
ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరులో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి ఘనంగా నిర్వహించే ఏర్పాట్లలో బిజీగా ఉన్న దంపతులు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఇలవేల్పు పూజకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పూజారి వద్దకు వెళ్లి వస్తుండగా వ్యాన్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరుకు చెందిన దామినేని శ్రీనివాస రావు, రజనీకుమారి దంపతులు. వారికి ఓ కుమార్తె, కుమారుడు వున్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం కాగా ఇటీవల కుమారుడికి పెళ్లి కుదిరింది. దీంతో శ్రీనివాస రావు దంపతులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివాహానికి ముందు ఇంట్లో ఉప్పలమ్మ తల్లికి పూజ నిర్వహించాలని భావించారు.
ఈ విషయంపై పూజారితో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడుకు వెళ్లారు. పూజారితో మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరగా.. గ్రామ శివారులో శ్రీనివాసరావు దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను కోళ్ల రవాణా వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. దీంతో త్వరలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.