4 కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కారు

  • ఏపీ రహదారుల అభివృద్ధి కార్పోరేషన్ కు 16 మంది డైరెక్టరల నియామకం
  • వెనకబడిన తరగతుల సహకార సంఘానికి 5గురు నియామకం
  • కమ్మ కార్పోరేషన్ కు 15 మంది డైరెక్టరల నియామకం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల పదవుల పందేరం కొనసాగుతోంది. ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం, తాజాగా మరో నాలుగు కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించింది.

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు 16 మంది, వెనకబడిన తరగతుల సహకార సంఘానికి ఐదుగురు, కమ్మ కార్పొరేషన్‌కు 15 మంది, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డైరెక్టర్ల నియామకంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు అవకాశం కల్పించింది. 


More Telugu News