: ఫెడరల్ ఫ్రంట్ ఓ జోక్: సీపీఐ(ఎం)
భారత రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఓ జోక్ అని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. కోల్ కతాలో సీపీఐ(ఎం) పార్టీ నేత సూర్యకాంత మిశ్రా మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీల కలయికతో వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న పశ్ఛిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. అసలు మమతా బెనర్జీ ఫెడరల్ భావనకు ఎప్పుడు మారిందో చెప్పాలని సూర్యకాంత మిశ్రా డిమాండ్ చేసారు.