'మదరాసి'లో మనసు దోచే రుక్మిణి వసంత్!

  • రేపు విడుదలవుతున్న 'మదరాసి'
  • టైటిల్ తోనే మార్కులు కొట్టేసిన మూవీ  
  • ప్రత్యేకమైన ఆకర్షణగా రుక్మిణి వసంత్
  • యూత్ లో పెరిగిపోయిన ఫాలోయింగ్
  • ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే చాన్స్  

ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నప్పటికీ, హీరోల కంటే హీరోయిన్స్ వైపు నుంచే ఎక్కువ పోటీ ఉంటుంది. ఇక్కడ జోరు చూపించే ఛాన్స్ గ్లామరస్ హీరోయిన్స్ కి ఎక్కువగా ఉంటుంది. నటన పరంగా కూడా ఫాలోయింగ్ పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు .. కాకపోతే చాలా తక్కువ. అలాంటి అరుదైన కథానాయికల జాబితాలో రుక్మిణి వసంత్ ఒకరుగా కనిపిస్తుంది. 

తెరపై కాస్త పద్ధతిగా కనిపించే పాత్రలైతేనే చేస్తాను అనే హీరోయిన్స్ జోలికి వెళ్లడానికి చాలా పాత్రలు భయపడతాయి. అందువలన ఈ తరహా హీరోయిన్స్ ఎక్కువ ప్రాజెక్టులలో కనిపించరు. అయినా చేసిన పాత్రలతోనే మంచి పేరు కొట్టేస్తూ ఉంటారు. ఆ జాబితాలో నిత్యామీనన్ .. సాయిపల్లవి వంటివారు కనిపిస్తూ ఉంటారు.  ఆ తరువాత స్థానంలో ఇప్పుడు రుక్మిణి వసంత్ కనిపిస్తోంది. సంప్రదాయ బద్ధంగా కనిపించే ఈ బ్యూటీకి ఇప్పుడు అభిమానుల సంఖ్య ఎక్కువే. అలాంటి ఈ  సుందరి ఇప్పుడు 'మదరాసి' సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దక్షిణాదివారిని ఉత్తరాదివారు 'మదరాసి' అని పిలుస్తూ ఉంటారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఉత్తరాదికి చెందిన వ్యక్తి .. అతను హీరోను 'మదరాసి' అని పిలుస్తూ ఉంటాడు. అందువల్లనే తాను ఈ సినిమాకి ఈ టైటిల్ ను పెట్టినట్టుగా మురుగదాస్ చెప్పాడు.  తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియాకి .. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయనీ,  యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ నిలుస్తాయని మురుగదాస్ చెప్పడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. శివకార్తికేయన్ జోడిగా రుక్మిణి వసంత్ మంచి మార్కులు కొట్టేయడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ సినిమాతో ఆమె కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని అంటున్నారు మరి. 





More Telugu News