: వర్షం కారణంగా ఆగిన ఆసీస్, కివీస్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న కివీస్, ఆసీస్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 15 ఓవర్లపాటు ఆడి రెండువికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. విలియమ్సన్ 18 పరుగులతోనూ, రాస్ టేలర్ 9 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. నిప్పులు చెరిగే బంతులతో మెక్ కే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. రెండు జట్లకు సమాన విజయావకాశాలు ఉన్న తరుణంలో వర్షం అడ్డంకిగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. వర్షం తగ్గితే మ్యాచ్ కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే రన్ రేట్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు. లేకపోతే రెండు జట్లకు చెరో పాయింటు ఇస్తారు.