'బెంగళూరు టీడీపీ ఫోరమ్'కు హృదయపూర్వక శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేశ్

  • 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్న బెంగళూరు టీడీపీ ఫోరమ్
  • ఫోరమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
  • రాష్ట్రం కోసం వారి కృషి అభినందనీయమని ప్రశంస
  • చంద్రబాబు పాలనే తమ అభివృద్ధికి కారణమని వారు విశ్వసించారని వెల్లడి
  • భవిష్యత్తులోనూ వారి సేవలు కొనసాగాలని ఆకాంక్ష
ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఏర్పాటు చేసుకున్న 'బెంగళూరు టీడీపీ ఫోరమ్' పై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ ఫోరమ్ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఫోరమ్ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

"ఉద్యోగ, వ్యాపార రీత్యా మాతృభూమికి దూరంగా బెంగళూరులో నివసిస్తున్నప్పటికీ, తమ జీవితాల్లో ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలనే కారణమని బలంగా విశ్వసించిన యువత... మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా విరాజిల్లుతుందని కలలు కన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న 'బెంగళూరు టీడీపీ ఫోరమ్' నేడు 12 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మాతృభూమి అభ్యున్నతి కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం మీరు నిరంతరం చేస్తున్న కృషి, కార్యకలాపాలు ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో కూడా కొనసాగాలని, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 


More Telugu News