'అలయ్ బలయ్' కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన బండారు దత్తాత్రేయ

  • రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసిన దత్తాత్రేయ
  • అక్టోబర్ 3న హైదరాబాద్‌లో 'అలయ్ బలయ్' కార్యక్రమం
  • ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన మాజీ గవర్నర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిశారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమం గురించి బండారు దత్తాత్రేయ రాష్ట్రపతికి వివరించారు. ప్రేమ, ఆప్యాయత, సోదరభావం చాటే అలయ్ బలయ్ కార్యక్రమం చాలా మంచిదని, అనేక సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇది కొనసాగడం సంతోషకరమైన విషయమని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు.


More Telugu News