: పుణ్యక్షేత్రాల సందర్శనలో లాలూ ప్రసాద్ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నారు. నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వరంలోని శివాలయంలో అభిషేకం, కాలసర్పదోషం, మరికొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమారులు, కుమార్తె హాజరయ్యారు. అనంతరం లాలూ అక్కడ్నుంచి షిర్డీ వెళ్లి సాయినాధుని దర్శించుకోనున్నారు.