ఏటా రెండుసార్లు దారిచ్చే సముద్రం.. సౌత్ కొరియాలో వింత.. వీడియో ఇదిగో!

––
సౌత్ కొరియాలోని ఓ సముద్రం ఏటా రెండుసార్లు రెండుగా చీలిపోతుంది. సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంటసేపు కనిపించే ఈ బ్రిడ్జిపై నడిచి దగ్గర్లోని ద్వీపం వరకు వెళ్లొచ్చు. ఈ ప్రకృతి వింత దేశవిదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. సముద్రం రెండుగా చీలిన సమయంలో వందలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఏటా ఏప్రిల్ లేదా మార్చి నెలలో, అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జిండో సముద్రంలో ఈ అరుదైన ఘటన జరుగుతుంది.



More Telugu News