ఆప్యాయంగా పలకరించుకున్న బండి సంజయ్, కేటీఆర్... వీడియో వైరల్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బండి సంజయ్, కేటీఆర్
- గంభీరావుపేట మండలంలో ఎదురుపడ్డ ఇరువురు నేతలు
- పరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించిన కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వరద ముంచెత్తుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు.
ఈ క్రమంలో, గంభీరావుపేట మండలంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరద పరిస్థితి గురించి బండి సంజయ్ కు కేటీఆర్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.