నదిలో పడిన వాహనం... కాపాడిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సిబ్బంది

  • లడక్‌లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పర్యటన
  • ద్రాస్ సమీపంలోనదిలోకి దూసుకెళ్లిన వాహనం
  • తన సిబ్బంది సకాలంలో స్పందించి ఇద్దరినీ సురక్షితంగా కాపాడినట్లు రిజిజు వెల్లడి
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సిబ్బంది నదిలో పడిపోయిన ఇద్దరిని రక్షించారు. కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు కొంతదూరంలో ఒక వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ సంఘటన మంగళవారం ద్రాస్ సమీపంలో చోటుచేసుకుంది.

కేంద్ర మంత్రి సిబ్బంది వెంటనే స్పందించడంతో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రిజిజు స్వయంగా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

"లడక్‌లోని ద్రాస్‌కు చేరుకునే ముందు, మా కాన్వాయ్‌కి ముందున్న వాహనం నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ, మేము సకాలంలో స్పందించడంతో వాహనంలో ఉన్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు" అని రిజిజు తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్'లో పంచుకున్నారు.


More Telugu News