: ఘరానా చేపనూనె 15 కోట్ల మోసం కథా కమామీషు


చేపనూనె పేరిట ఖాతాదారులకు 15 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన ఘరానామోసగాళ్లు ఎట్టకేలకు అరెస్టయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వారి వివరాల్ని పోలీసులు బయటపెట్టారు. వీరంతా కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కరీంనగర్ కు చెందిన వంశీకృష్ణా రెడ్డి ఎంఎస్సీ, బీఎడ్ చేసాడు కఠినమైన లెక్కల్ని సులువుగా పరిష్కరించగలిగిన ఈయన లెక్కతప్పాడు. స్కూలు నిర్వహిస్తూనే బియ్యం వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించాడు. బాగా సంపాదించేద్దామని అధికవడ్డీకి డబ్బులు తీసుకుని లావాదేవీలు నిర్వహించాడు. దీంతో అప్పులపాలయ్యడు. ఆ క్రమంలో మీడియాలో వచ్చిన చేపనూనె కథనం కొత్త ఆలోచనలు రేకెత్తించింది.

విశాఖ పర్యాటకుడిగా వచ్చిన వంశీకృష్ణారెడ్డి ఇక్కడి పరిస్థితుల్ని పరిసరాలను బాగా వంటబట్టించుకుని తిరిగి వెళ్లిపోయాడు. మత్స్యసంపద తద్వారా నూనె ఎగుమతులు చేస్తున్నామని ప్రచారం కల్పించాడు. ఇది నమ్మేందుకు ముంబై జాతీయ పోర్టు ఆథరైజ్డ్ గా విశాఖ ఫిషరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇమామ్ ఫిషరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టు చెప్పాడు. ఈ సంస్థల్లో పెట్టుబడి పెడితే నెలనెలా 5 నుంచి 12 శాతం వాపసు ఇస్తానని నమ్మబలికాడు.

సోదరుడు శ్రీనివాసరెడ్డి, కొవ్వూరుకు చెందిన ఉపాధ్యాయుడు బెనర్జీని సహాయకులుగా నియమించుకున్నాడు. వీర్ని నమ్మిన కొంతమంది న్యాయవాదులు, ఉద్యోగులు, వ్యాపారులు 2010లో 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. వీటితో వ్యాపారం ప్రారంభించాడు. మొదటి ఆరునెలలు సరిగ్గానే చెల్లించాడు. తరువాతే భారీమొత్తం నెత్తినపడడంతో చెల్లింపులు చెల్లించలేదు. దీంతో ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి విశాఖ వచ్చి ఆరాతీసి ఏ కంపెనీ విశాఖలో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కస్టమర్ల రూపంలో మాట్లాడి వారిని అరెస్టు చేయడంతో కధ కైమాక్స్ కు చేరుకుంది.

వంశీకృష్ణ సేకరించిన డిపాజిట్లతో సిద్దిపేటలో 10 ఎకరాలు, మెదక్ జిల్లా రామవరంలో మరో 10 ఎకరాల స్ధలాన్ని కోనుగోలు చేసినట్టు తెలిపారు. మరిన్ని వివరాలు విచారణలో బయటపడే అవకాశముందని తెలిపారు.

  • Loading...

More Telugu News