వార్-2 వివాదంపై స్పందించాలనుకోవడంలేదు: నారా రోహిత్
- ఆ ఆడియోను ఇప్పటి వరకు తను వినలేదన్న రోహిత్
- ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానని వెల్లడి
- మంచి కథ దొరికితే తప్పకుండా కలిసి పని చేస్తానని వ్యాఖ్య
- సుందరకాండ మూవీని చంద్రబాబు, లోకేశ్‌కు ప్రత్యేకంగా చూపిస్తానన్న రోహిత్
యంగ్ హీరో నారా రోహిత్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘సుందరకాండ’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనపై ఓ కాంట్రవర్సీ ఊపందుకుంది. ‘వార్ – 2’ మూవీని చూడొద్దని నారా రోహిత్ అన్నారంటూ కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఈ అంశంపై రోహిత్ స్పందిస్తూ.. ‘వార్-2 విషయంలో వినిపిస్తున్న ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆ ఆడియో ఇప్పటి వరకు వినలేదు. అందులో ఏముందో కూడా తెలియదు. అందుకే దానిపై స్పందించాలని అనుకోవడం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా. మంచి కథ దొరికితే తప్పకుండా కలిసి పనిచేస్తాను’ అన్నారు. ఇక రాజకీయాల్లో ప్రవేశించడంపై కూడా నారా రోహిత్ ఈ సందర్భంగా స్పందించారు. ‘రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా. కానీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. సరైన సమయానికి పూర్తి క్లారిటీ ఇస్తా’ అని పేర్కొన్నారు.
ఆగస్టు 27న విడుదలవుతున్న ‘సుందరకాండ’ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రంగా దీనిని రూపొందించాం. లవ్, ఎమోషన్స్‌తో నిండిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. తన సినిమాలను నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ తప్పకుండా చూస్తారనీ, ఈ చిత్రాన్ని కూడా వారికి ప్రత్యేకంగా చూపిస్తానని రోహిత్ వెల్లడించారు.