: టీడీపీ నేతలకు బాబు క్లాసు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్వంత పార్టీ నేతల వ్యవహార శైలిపై చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే తగిన రీతిలో పోరాడడం లేదంటూ తమపార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలపై చర్చ జరుగకుండా స్పీకర్ సభను వాయిదాలమీద వాయిదాలు వేస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు గంటలు కూడా సభలో కూర్చోలేని వారు రాజకీయాలు ఎలా చేస్తారంటూ చురకలంటించారు. మంత్రులు స్పీకర్ నుంచి మైక్ తీసుకుని ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారంటూ బాబు నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.