నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

  • సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • సీఆర్డీఏ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్న కేబినెట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ క్రమంలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.904 కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదనపై కీలక నిర్ణయం వెలువడనుంది.

చర్చకు వచ్చే అంశాలు:

సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి రూ.904 కోట్ల మంజూరు
రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు
జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్ల మార్పు
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చర్చ

ఇవి కాకుండా, ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.

సీఎం ప్రత్యేకంగా చర్చించే అంశాలు:

పెరోల్ అంశం, ఎమ్మెల్యేలు–మంత్రుల ప్రవర్తనపై సమీక్ష
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు
నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలు
మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు 


More Telugu News