ఇబ్బందుల్లో వసీం అక్రమ్... లాహోర్ లోని సైబర్ క్రైమ్ ఏజెన్సీలో అక్రమ్ పై ఫిర్యాదు

  • బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌ను అక్రమ్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఆరోపణ
  • లాహోర్‌లోని సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి
  • 'బాజీ' అనే విదేశీ యాప్‌కు అక్రమ్ ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణ
  • సోషల్ మీడియా వీడియోలు, పోస్టర్లను సాక్ష్యాలుగా సమర్పణ
  • ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక బెట్టింగ్ యాప్‌కు ప్రచారం కల్పించారన్న ఆరోపణలతో ఆయనపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు అందింది. జూదాన్ని ప్రోత్సహిస్తున్న అక్రమ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరారు.

లాహోర్‌కు చెందిన ముహమ్మద్ ఫైజ్ అనే వ్యక్తి అక్కడి నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA)కి ఈ ఫిర్యాదు చేశారు. 'బాజీ' అనే ఒక విదేశీ బెట్టింగ్ యాప్‌కు వసీం అక్రమ్ బ్రాండ్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారని ఫైజ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనికి సంబంధించిన పోస్టర్లు, వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో ఉన్నాయని, వాటిని సాక్ష్యాలుగా సమర్పించారు. అక్రమ్ లాంటి ప్రముఖ వ్యక్తి ఇలాంటి యాప్‌లకు మద్దతు ఇవ్వడం వల్ల సాధారణ ప్రజలు సులభంగా ప్రభావితమై జూదం బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ 2016 కింద అక్రమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.



More Telugu News