నేడు అమెరికాకు వెళుతున్న కవిత... కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పయనం

  • కుమారుడిని అమెరికాలో కాలేజీలో చేర్పించేందుకు వెళుతున్న కవిత
  • 15 రోజుల పాటు యూఎస్ లోనే ఉండనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • కుమారుడికి తాత ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కు వెళుతున్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అమెరికాకు వెళుతున్నారు. తన కుమారుడిని అక్కడ కాలేజీలో చేర్పించనున్నారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె అమెరికా వెళ్లేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతితో ఆమె యూఎస్ వెళుతున్నారు. మరోవైపు, కాసేపట్లో ఆమె ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. తన కుమారుడికి తన తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కు కవిత వెళుతున్నారు.


More Telugu News