స్వాతంత్రోద్యమంలో గుంటూరు నేలది చెరగని ముద్ర: మంత్రి లోకేశ్
- గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్
- మార్పు మననుంచే మొదలు కావాలన్న మంత్రి
- గాంధీజీ మనకిచ్చిన పవర్ ఫుల్ వెపన్ అహింస అని వ్యాఖ్య
- మన దేశ పవర్ ఫుల్ మిస్సైల్ ప్రధాని నరేంద్ర మోదీ అన్న లోకేశ్
- గత 5ఏళ్ల చీకటిపాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ
- డబుల్ ఇంజన్ సర్కారుతో విజయవంతంగా తొలిఅడుగు వేశామన్న మంత్రి
ఈరోజు మహాత్మా గాంధీ చెప్పిన ఒక్క గొప్ప విషయం నాకు గుర్తుకు వస్తోంది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలని గాంధీజీ చెప్పారు, ఆ మహనీయుని స్పూర్తితో మార్పు మన నుండే మొదలుకావాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బమ్స్ వచ్చేవి. ఆ మూమెంట్ ఈ రోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ ఫుల్ వెపన్ ఉంది. ఇతర ఏ వెపన్స్ చెయ్యలేని పని ఆ వెపన్ చేస్తుంది. ఆ వెపన్ పేరే అహింస. ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాత్రంత్య్రం సాధించారు.
తెలుగునేలది ప్రత్యేక చరిత్ర
స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేల కు ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ వాడి తుపాకీకి గుండె చూపిన యోధుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. “మాకొద్దీ తెల్లదొరతనం” అని నినదించారు గరిమెళ్ల సత్యనారాయణ. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్య్రం సమరయోధులు మన తెలుగు నేలపైనే పుట్టారు. మన సమరయోధుల ఘనకీర్తి దేశానికి తెలిసేలా చేద్దాం. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దాం.
గుంటూరు జిల్లాలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన జిల్లాలోని పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగం చేశారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు, ఆనాటి ఘట్టాలను గుర్తు చేస్తూ ఒక మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నాం.
స్వాతంత్రోద్యమంలో చెరగని ముద్ర
స్వతంత్ర పోరాటంలో గుంటూరు నేలది చెరగని ముద్ర. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య చౌదరి, తమనంపల్లి అమృతరావు వంటి ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారందరి సేవలను మనం గుర్తు చేసుకోవాలి. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. అందరిలోనూ దేశ భక్తి ఉండాలి. దేశం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటి అవ్వాలి. ఈ సందర్భంగా పెహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుకోవాలి. పాకిస్థాన్ ఉగ్రవాదులు పెహల్గామ్ లో దాడులు చేసి 26 మంది అమాయకుల్ని చంపేశారు. గత ప్రభుత్వాల మాదిరి మనం కన్నీరు పెట్టుకొని ఇతర దేశాల సహాయం కోసం వెళ్ళలేదు. మన దేశ పవర్ ఫుల్ మిస్సైల్ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పాక్‌కి సరైన శిక్ష వేశారు. ఆపరేషన్ సిందూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్ జరిగేప్పుడు కొంతమంది సైనికులను కూడా మనం కోల్పోయాం. అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ ను కూడా కోల్పోయాం. మురళీ నాయక్ తల్లితండ్రిని నేను కలిశాను. వారికి ఒక్కడే కొడుకు. మురళి నాయక్ సైన్యం లోకి వెళ్లడం వారికి ఇష్టం లేదు. మురళి నాయక్ ను ఆర్మీ కి వెళ్లొద్దు, నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేం అన్నారు. అప్పుడు మురళి నాయక్ ఒక్కటే చెప్పాడు. నేను యుద్ధంలో చనిపోతే దేశం మొత్తం మీ కోసం నిలబడుతుంది అని. మురళి నాయక్ లాంటి సైనికులు బోర్డర్ లో పోరాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
5ఏళ్ల అరాచకపాలనలో 30ఏళ్లు వెనక్కి
2019 నుండి 2024 వరకూ ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూసాం. గత ప్రభుత్వం ఐదేళ్ల లో 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అడ్రెస్స్ లేకుండా పోయింది. 2024 లో ప్రజలు చరిత్ర సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 164 సీట్లలో ఎన్డీయే ను గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుండి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న కలిసి సుపరిపాలనలో తొలిఅడుగు వేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నాం. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చింది. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. విశాఖ ఉక్కును మోదీ సహకారంతో కాపాడుకోగలిగాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్ కి సహకారం అందించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మన నినాదం. అందుకు అనుగుణంగానే రాష్ట్రం నలుమూలల వివిధ రకాల పరిశ్రమలు రప్పిస్తున్నాం. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఆర్సెలర్ మిట్టల్, ఎఎన్ఎస్ఆర్, సత్వ వంటి బడా కంపెనీలను రాష్ట్రానికి రప్పించాం.
సూపర్ సిక్స్... సూపర్ హిట్
పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే నిజమైన స్వాతంత్య్రం అని నేను బలంగా నమ్ముతాను. అందులో భాగంగా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి. పెన్షన్ 4 వేలు చేశాం, దివ్యాంగులకు 6 వేలు, పూర్తిగా బెడ్ కే పరిమితం అయితే 15 వేలు. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరిని బడికి పంపి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది గత ప్రభుత్వ విధానం. కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. 67 లక్షల 27 వేల మంది పిల్లలకు 10,091 కోట్లు అందించారు.
అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి 7 వేల సాయం మొదటి విడత కింద అందించాం. దీపం పథకం కింద 2 కోట్ల సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందించాం. ఈ రోజు నుంచి స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదు. మీ ప్రజా ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసింది. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9.35 లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. ఆర్సెల్లార్ మిట్టల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా, ఏఎన్ఎస్ఆర్, ఎల్జీ ఎలెక్ట్రానిక్స్, రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఏపీకి వచ్చాయి.
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు
విద్యా వ్యవస్థలో ఏడాదిగా సమూల మార్పులు తెచ్చాం. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలి అనేది నేను బలంగా నమ్ముతాను. గత ప్రభుత్వ రంగుల, పేర్ల పిచ్చి మీరు చూశారు. కోడి గుడ్డు దగ్గర నుంచి పిల్లలు వేసుకునే యూనిఫామ్ వరకూ పార్టీ రంగులు ఉండేవి. నేను విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. కేజీ నుంచి పీజీ వరకూ కరికులం మార్చాము. సెమిస్టర్ వైస్ బుక్స్ తీసుకొచ్చి పిల్లలకు బరువు తగ్గించాం. పుస్తకాల్లో నా ఫొటోలు లేవు, ముఖ్యమంత్రి ఫొటోలు లేవు. గతంలో 1200 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఇప్పుడు 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేశాం. మెగా పీటీఎం నిర్వహిస్తున్నాం. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు స్కూల్స్ లో నిర్వహించడానికి లేదని ఆర్డర్ ఇచ్చాం. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం.
స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టాం. పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు విద్యార్థులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజన పధకం ఆపేసారు. నేను తిరిగి ప్రారంభించాను. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నాం. మంచి వ్యక్తులను వీసీలుగా నియమిస్తున్నాం. పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వం ఉండేలా ఇంటి పనుల ఫోటోలు చెరోసగం ఉండేలా చర్యలు తీసుకున్నాం. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నాం.
యంత్రాంగానికి కృతజ్ఞతలు
గత ఏడాది కాలంలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధిని మీకు నివేదిక రూపంలో అందించాం. గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబుకు, నా తోటి మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులకు, జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరయోధుల కుటుంబాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, డీఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, ఎస్పీ సతీశ్ కుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీరుద్దీన్, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.