: జపాన్ లో చరణ్ క్రేజ్
హీరో రామ్ చరణ్ తెలుగులో హాట్ సెలెబ్రిటీ. జంజీర్ సినిమాతో దేశవ్యాప్తంగా కూడా చరణ్ అందరి నోళ్లలో బాగానే నానుతున్నాడు. ఇందులో విశేషం సంగతి పక్కనపెడితే.. జపాన్ దేశంలో చరణ్ కు మంచి క్రేజ్ ఏర్పడిందన్నదే అసలు విశేషం. ఆ ప్రాచుర్యం ఎంతలా ఉందంటే చరణ్ పేరుతో ఏకంగా అక్కడో బిస్కెట్ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేంత. భారతీయ సినిమాలు బాగా చూసే జపనీయులకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. రాజమౌళి సినిమా మగధీర అక్కడ జపాన్ టైటిళ్లతో విడుదలైన తరువాత చరణ్ కు కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. దీనిని గమనించిన అక్కడి ఓ ప్రముఖ బిస్కెట్ల కంపెనీ 'చరణ్ లవ్స్ క్రీమ్ బిస్కెట్స్' పేరుతో చరణ్ బొమ్మ వేసి మరీ క్రీమ్ బిస్కెట్ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇప్పుడా బిస్కట్లకు మంచి గిరాకీ లభిస్తోందని చెబుతోంది సదరు కంపెనీ.