వికారాబాద్ జిల్లాలో కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

    
వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిగి మండలంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్‌లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురైన ప్రజలను ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News