ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!

  • నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కేసులో విచారణ
  • తొలిసారి నోటీసులు పంపగా గడువు కోరిన రానా
  • ఈ కేసులో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరు
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసుకు సంబంధించి ప్రముఖ హీరో దగ్గుబాటి రానా ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. యాప్ ల ప్రమోషన్లకు సంబంధించి అందుకున్న పారితోషికం, కమీషన్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మొదటిసారి నోటీసులు పంపగా.. ముందస్తుగా నిర్ణయించిన పనుల వల్ల హాజరుకాలేనని, తనకు కొంత సమయం ఇవ్వాలని రానా అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

దీంతో విచారణ తేదీని ఈ రోజుకు మార్చుతూ ఈడీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు. తాజాగా రానా ఈడీ ఆఫీసుకు వెళ్లి అధికారుల ముందు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేశారనే కేసులో సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ.. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ లను విచారించింది. ఈ నెల 13న నటి మంచు లక్ష్మి విచారణకు హాజరవుతారని సమాచారం.


More Telugu News