రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్నాయనే వార్తలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
- అవన్నీ తప్పుడు వార్తలన్న పీసీసీ చీఫ్
- రేవంత్ తో మంచి అనుబంధం ఉందని వ్యాఖ్య
- బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం కావడం ఖాయమని ధీమా
సీఎం రేవంత్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆ ప్రచారంలో నిజం లేదని... అవన్నీ తప్పుడు వార్తలని చెప్పారు. రేవంత్ కు, తనకు మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. తమ మధ్య ఉన్న సత్సంబంధాల వల్లే బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయగలిగామని చెప్పారు.
బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ల మౌనం బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.