వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు వెల్లడించిన సీబీఐ
--
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అధికారికంగా వెల్లడించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ముందుకువెళతామని తెలిపింది. దీంతో జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం మరోసారి ఈ కేసును విచారించనుందని సమాచారం.