: ఢిల్లీలో ఒడిశా మహాసమరం
కేంద్రం నుంచి తమ రాష్ట్రం వివక్షకు గురవుతోందంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఈరోజు మహా ర్యాలీ నిర్వహించారు. 30,000 మందితోపాటు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ర్యాలీలో ఫాల్గొన్నారు. "దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న మా రాష్ట్రం విషయంలో రాజకీయ కారణాలతో కేంద్రం చిన్నచూపు చూస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక ప్రయోజనాలను కేంద్రం నుంచి అధికంగా పొందుతున్నాయి. మా రాష్ట్రానికీ ప్రత్యేక ప్రతిఫలాలు కచ్చితంగా దక్కాల్సిందే. కోటిమంది ఒడిశావాసులు సంతకం చేసిన పిటిషన్ ను ఈ ర్యాలీ అనంతరం రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి అందజేయనున్నాం. ఒడిషాలోని దాదాపు ప్రతి ఇంటినుంచి ఈ పిటిషన్ విషయంలో ప్రాతినిధ్యం ఉంది" అన్నారు నవీన్ పట్నాయక్.